Love for dogs: కొడుకుపై కోపం..పెంపుడు శునకానికి రెండెక‌రాల భూమి రాసిన తండ్రి..చివర్లో ట్విస్ట్ ఏంటంటే..?

|

Dec 31, 2020 | 4:38 PM

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కుమారుడి ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో ఓ వ్యక్తి తన ఆస్తిలో సగభాగాన్ని పెంపుడు కుక్క పేరున రాశాడు.

Love for dogs: కొడుకుపై కోపం..పెంపుడు శునకానికి రెండెక‌రాల భూమి రాసిన తండ్రి..చివర్లో ట్విస్ట్ ఏంటంటే..?
Follow us on

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కుమారుడి ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో ఓ వ్యక్తి తన ఆస్తిలో కొంత భాగాన్ని పెంపుడు కుక్క పేరున రాశాడు. వివరాల్లోకి వెళ్తే బరివాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ అనే వ్యక్తికి తన పెంపుకు శునకం జాకీ అంటే విపరీతమైన ఇష్టం. మరోవైపు తన కుమారుడు తనపై ప్రేమను చూపించడని, అతని ప్రవర్తన కూడా సరిగా ఉండదని ఆరోపిస్తూ..ఏకంగా పెంపుడు శునకానికి రెండెక‌రాల‌ను రాశాడు. మిగతా ఆస్తిని తన రెండవ భార్య చంపా వర్మ పేరుమీద వీలునామా చేయించాడు.

‘నా అర్థాంగి, నా పెంపుడు శునకం( జాకీ) మాత్రమే నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. అందుకే నా ఆస్తి మొత్తాన్ని వారి పేరు మీద రాస్తున్నా’ అని ఓం నారాయణ పేర్కొన్నాడు. తాను చ‌నిపోయిన త‌ర్వాత ఇంత ప్రేమగా మెలిగిన కుక్క అనాథ‌గా మార‌డం ఇష్టం లేక, త‌న త‌ర్వాత ఆ కుక్క బాగోగులు చూసే వారికి ఆ రెండెక‌రాల భూమి చెందుతుంద‌ని కూడా త‌న వీలునామాలో రాశాడు ఓం నారాయణ.

ఈ వార్త బయటకు రాగానే భలే..భలే.. ఆ కుక్క ఎంత లక్కీ అని చాలా మంది అనుకున్నారు. అయితే అంతలోనే ఓం నారాయణ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తొలుత కోపంలో తాను ఈ పని చేసినా.. తర్వాత గ్రామ సర్పంచ్ సర్దిచెప్పడంతో వీలునామాను ఉపసంహరించుకుంటున్నట్లు ఓం నారాయణ చెప్పడం గమనార్హం.

 

Also Read :

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..