UPSC Result: ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులు ఎలా నిర్ణయిస్తారు.. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే..!

|

May 30, 2022 | 5:50 PM

UPSC Result: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 ఫలితాలను విడుదల చేసింది . మొత్తం 685 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

UPSC Result:  ఐఏఎస్‌, ఐపీఎస్‌  పోస్టులు ఎలా నిర్ణయిస్తారు..  ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే..!
Upsc
Follow us on

UPSC Result: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 ఫలితాలను విడుదల చేసింది . మొత్తం 685 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ అభ్యర్థులకి IAS, IPS, IFS మొదలైన పోస్టులని కేటాయిస్తారు. అయితే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అందరు IAS, IPS అవ్వరు. ఈ పోస్టుల నియామకం కోసం ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. దీని ప్రకారం అభ్యర్థులని ఆయా పోస్టులకి ఎంపిక చేస్తారు. అది ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభ్యర్థుల ఎంపిక ఎలా..?

ముందుగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఎన్ని దశలు ఉన్నాయో తెలుసుకుందాం. వాస్తవానికి ప్రభుత్వం సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకి హాజరవుతారు. ఇందులో ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో పాల్గొంటారు. దీని తర్వాత తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ రేసులో ఉంటారు.

ఇవి కూడా చదవండి

IAS, IPS మాత్రమే కాదు ఇంకా చాలా సర్వీసెస్‌..

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు IAS లేదా IPS అవుతారని అనుకుంటారు. కానీ అందరు అవ్వరు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్‌లో 24 సర్వీసులు ఉంటాయి. వీటన్నింటిలో అభ్యర్థులను నియమిస్తారు. ముఖ్యంగా సర్వీసెస్‌లో ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అనే రెండు వర్గాలు ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఐఏఎస్, ఐపీఎస్ తదితర పోస్టులుంటాయి. అదే సమయంలో సెంట్రల్ సర్వీస్‌లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే IFS, IIS, IRPS, ICAC తదితర పోస్టులు ఉంటాయి. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ కూడా సివిల్ సర్వీస్‌లోకి వస్తుంది.

ఎలా నిర్ణయిస్తారు..?

ఏ అభ్యర్థికి ఏ ఉద్యోగం కేటాయిస్తారో తెలుసుకుందాం. వాస్తవానికి ముందుగా అభ్యర్థుల ప్రాధాన్యతను తెలుసుకుంటారు. దీని ఆధారంగానే పోస్టులని విభజిస్తారు. సాధారణంగా ర్యాంకింగ్ ఆధారంగా పోస్టుల పంపిణీ ఉంటుంది. ఇందులో టాప్ ర్యాంక్ అభ్యర్థులు IAS, IFS వంటి సేవలను పొందుతారు. కానీ అగ్రశ్రేణి అభ్యర్థులందరు ఐఏఎస్‌లు అవుతారని కాదు. ఒక అభ్యర్థికి మంచి ర్యాంక్ వచ్చి ఐపీఎస్‌ కోరుకుంటే అతడికి ఐపీఎస్ కేటాయిస్తారు. అంటే అభ్యర్థుల ఇష్టాయిష్టాలు, సేవ చేసే గుణం, ర్యాంక్ ఆధారంగా పోస్టులని కేటాయించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కూడా పోస్టులని కేటాయించే వీలుంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు తక్కువ ర్యాంక్ అభ్యర్థులు కూడా IFS లాంటి ఉన్న త ఉద్యోగాలు పొందుతారు. ఈసారి ఐఏఎస్‌కు 180, ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 పోస్టులు ఉన్నాయి.

మరిన్ని నాలెడ్జ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి