రికార్డు సృష్టించిన ఆ హీరోయిన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న లక్కీ బ్యూటీ.. కరోనా కాలంలోనూ ఆగని ఆఫర్లు..
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసింది ఉప్పెన హీరోయిన్. తీసింది ఒకే సినిమా అయిన.. అది కూడా విడుదల కాకముందే మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కృతి షెట్టి.
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసింది ఉప్పెన హీరోయిన్. తీసింది ఒకే సినిమా అయిన.. అది కూడా విడుదల కాకముందే మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కృతి షెట్టి. తను నటించిన ‘ఉప్పెన’ మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ఇప్పటివరకు మూడు చిత్రాల ఆఫర్లను దక్కించుకుంది. ఇంకా మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇటు ఈ సంవత్సరంలో విడుదల కావాల్సిన ఉప్పెన మూవీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. యావత్ ప్రపంచానికి నిరాశలు మిగిల్చిన ఈ మహమ్మారి ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరికొత్త అవకాశాలను కల్పించిందనే చెప్పాలి. అటు తమిళం నుంచి కూడా భారీగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ టాప్ హీరో సూర్య మెయిల్ రోల్ చేస్తున్న మరో సినిమాలో కృతిషెట్టి నట్టించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని సినిమాలను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టినట్లుగా సమాచారం. సూర్య హీరోగా నటిస్తున్న సినిమాను హరి దర్శకత్వం వహిస్తున్నాడు.