ఆన్‌లైన్ గేమ్‌లో భాగంగా.. హ్యాకర్ గా మారి.. 10 లక్షలు దోచేసిన కుర్రాడు..!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మొబైల్ ఫోన్ అనేది మానవ జీవితంలో తప్పనిసరి అయింది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ డబ్బు ఖర్చు చేసే కుర్రాళ్లను చూస్తుంటాం. కానీ ఆ గేమ్స్‌లో చెప్పారంటూ

ఆన్‌లైన్ గేమ్‌లో భాగంగా.. హ్యాకర్ గా మారి.. 10 లక్షలు దోచేసిన కుర్రాడు..!

Edited By:

Updated on: Jun 29, 2020 | 4:49 AM

Online game’s ‘dare’: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మొబైల్ ఫోన్ అనేది మానవ జీవితంలో తప్పనిసరి అయింది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ డబ్బు ఖర్చు చేసే కుర్రాళ్లను చూస్తుంటాం. కానీ ఆ గేమ్స్‌లో చెప్పారంటూ క్రైమ్స్ చేసేవాళ్లను ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఈ విషయం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 20ఏళ్ల కుర్రాడు ఓ అంతర్జాతీయ ఆన్‌లైన్ గేమ్ ఆడేవాడు.

వివరాల్లోకెళితే.. ‘ట్రూత్ ఆర్ డేర్’ అనే గేమ్ లో భాగంగా.. ఇతరుల బ్యాంకు ఖాతా నుంచి రూ.10లక్షలు కాజేయాలని అతనికి చెప్పారు. దానికోసం కావలసిన హ్యాకింగ్ పాఠాలు కూడా అదే గేమ్‌లో నేర్పించారు. దీంతో అవి నేర్చుకున్న సదరు యువకుడు.. ఓ ప్రైవేటు స్కూల్ టీచర్‌కు చెందిన బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశాడు. దాన్నుంచి రూ.10లక్షలు కాజేశాడు. ఖాతాలో సొమ్ము పోయినట్లు గుర్తించిన ఆ టీచర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.