పాక్‌కు భారీ ఎదురుదెబ్బ!

|

Aug 16, 2019 | 10:25 PM

జమ్ము కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై అత్యవసరంగా చర్చ జరగాలని ఐరాస భద్రతా మండలికి లేఖ రాసింది పాకిస్థాన్‌. పాక్​ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా కూడా లేఖ అందజేసింది. దీంతో ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులు జరిపింది. ఇది కేవలం భారత్, పాక్​ల ద్వైపాక్షిక సమస్య మాత్రమే అని రష్యా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి దిమిట్రీ […]

పాక్‌కు భారీ ఎదురుదెబ్బ!
UN Meeting Over Kashmir
Follow us on

జమ్ము కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై అత్యవసరంగా చర్చ జరగాలని ఐరాస భద్రతా మండలికి లేఖ రాసింది పాకిస్థాన్‌. పాక్​ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా కూడా లేఖ అందజేసింది. దీంతో ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులు జరిపింది.

ఇది కేవలం భారత్, పాక్​ల ద్వైపాక్షిక సమస్య మాత్రమే అని రష్యా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి దిమిట్రీ పోలింస్కీ సమావేశానికి హాజరయ్యే ముందు భారతకు మద్దతుగా ప్రకటన చేశారు. కాగా పాక్‌కు చైనా వత్తాసు పలికింది.

కాగా భారత్‌పై ప్రపంచ వ్యాప్తంగా పాక్ విషం కక్కుతోందని భారత ప్రతినిధి అక్బరుద్దిన్ ఆరోపించారు. భారత వికాసం కోసమే జమ్ము కశ్మీర్​ విభజన జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత్ ప్రపంచ దేశాల ముందు చిన్నబుచ్చుదామని చూసిన పాక్‌కు రష్యా నిర్ణయంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది.