అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తి వేయాలి: కేంద్రం
అన్‌లాక్ 3.0 నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.

Unlock 3.0 Inter State Travel: అన్‌లాక్ 3.0 నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. అన్ని కూడా సాఫీగా సాగాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆంక్షలు విధించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలకు, ఉపాధిపై ప్రభావం పడుతోందన్నారు. కాగా, కేంద్రం మాటను కాదని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన చట్టం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. కాగా, అన్‌లాక్ 3.0 ఆగష్టు 31తో పూర్తి కానుంది. ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
Also Read: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!





