జమ్మూ కాశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కోసం ఒక్కటైన ప్రాంతీయ పార్టీలు

జమ్మూ కాశ్మీర్ కి స్వయంప్రతిపతిని పునరుధ్ధరించాలంటూ అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. తమ విభేదాలను పక్కనపెట్టి ఇందుకు ఉద్యమించాలని ఈ పార్టీల నాయకులంతా.

జమ్మూ కాశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కోసం ఒక్కటైన ప్రాంతీయ పార్టీలు
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2020 | 6:30 PM

జమ్మూ కాశ్మీర్ కి స్వయంప్రతిపతిని పునరుధ్ధరించాలంటూ అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. తమ విభేదాలను పక్కనపెట్టి ఇందుకు ఉద్యమించాలని ఈ పార్టీల నాయకులంతా నిర్ణయించారు. గత ఏడాది ఆగస్టు 5 న ఈ ప్రాంతానికి స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసి దీన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. అయితే ఆ చర్యను ఈ పార్టీల నేతలంతా ఖండించారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఐ-ఎం, కాంగ్రెస్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేస్తూ.. ఇక తామంతా ఒక్కతాటిపై నిలబడి…  జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికోసం నిర్విరామంగా పోరాడుతామని పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టు 4 న ఆమోదించిన ‘గుప్ కార్ డిక్లరేషన్ ‘ కు కట్టుబడి ఉండాలని కూడా వీరు నిర్ణయించారు.