విషాదం : కూతుర్ని చూడ‌నివ్వ‌లేద‌ని తండ్రి ఆత్మహత్య

త‌న పాప‌ను మొద‌టిసారి చూసుకోవాలని ఆశ‌ప‌డ్డాడు ఆ తండ్రి. విబేధాల కార‌ణంగా అందుకు భార్య కుద‌రద‌ని చెప్పింది. దీంతో తీవ్ర మ‌న‌స్థాపంలో అత‌డు త‌నువు చాలించాడు

  • Ram Naramaneni
  • Publish Date - 5:35 pm, Sat, 22 August 20
విషాదం :  కూతుర్ని చూడ‌నివ్వ‌లేద‌ని తండ్రి ఆత్మహత్య

త‌న పాప‌ను మొద‌టిసారి చూసుకోవాలని ఆశ‌ప‌డ్డాడు ఆ తండ్రి. విబేధాల కార‌ణంగా అందుకు భార్య కుద‌రద‌ని చెప్పింది. దీంతో తీవ్ర మ‌న‌స్థాపంలో అత‌డు త‌నువు చాలించాడు. ఈ విషాద ఘ‌ట‌న‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది.

పోలీసుల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఎన్టీఆర్‌ నగర్‌ నివాసి నక్కా అర్జున్‌(24) కారు డ్రైవర్ ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు‌. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన యువ‌తిని అత‌డు లవ్ మ్యారేజ్‌ చేసుకున్నాడు. కొన్నాళ్లు సవ్యంగానే సాగిన వీరి కాపురంలో అనూహ్యంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. అర్జున్‌ భార్యకు 9 రోజుల క్రితం పాప జ‌న్మించింది. కూతుర్ని చూసేందుకు అర్జున్‌ వెళ్తే భార్య ఇంట్లోకి రానివ్వ‌లేదు. దీంతో మనస్తాపం చెందిన అర్జున్‌ శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి సోదరి ఫిర్యాదు చెయ్య‌డంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

 పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !