అన్‌లాక్‌ 1: రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెన్.. లైట్ తీసుకుంటే కష్టమే..!

|

Jun 08, 2020 | 8:47 AM

మొదట్లో కరోనా వైరస్ అంటే వణికిపోయిన ప్రజలు ఇప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే ఇవాళ్టి నుంచి అన్‌లాక్‌ 1 నేపథ్యంలో దేశవ్యాప్తంగా హోటళ్లు, ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి...

అన్‌లాక్‌ 1: రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెన్.. లైట్ తీసుకుంటే కష్టమే..!
Follow us on

మొదట్లో కరోనా వైరస్ అంటే వణికిపోయిన ప్రజలు ఇప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ్టి నుంచి అన్‌లాక్‌ 1 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా హోటళ్లు, ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ ఇవి తెరుచుకోనున్నాయి. వరుసగా ఐదోసారి రోజుకు 9,000 పైచిలుకు కేసులు దేశంలో నమోదవుతున్న తరుణంలో ఈ అన్‌లాక్‌ 1 ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఈ అన్‌లాక్‌ 1 కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 5 రాష్ట్రాలకు సవాల్‌గా మారనుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నా కేసులు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పటి నుంచి ప్రజలు అసలైన పరీక్షను ఎదుర్కోనున్నారు. మాల్స్, రెస్టారెంట్లు, ఆలయాలు ఓపెన్ అయ్యాయి. మునపటిలా పరిస్థితి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షాపింగ్ మాల్స్‌లో సినిమా థియేటర్లు, గేమింగ్ ప్లేస్స్, పిల్లలు ఆడుకునే ఏరియాలు మూసే ఉంటాయి. కాగా, ఇప్పటి నుంచి దిశల వారీగా కార్యకలాపాలన్నీ కూడా పునరుద్దరణ కానుండటంతో ప్రతీ ఒక్కరూ కూడా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..