అన్ని ఎగ్జామ్స్ రద్దు- విద్యా సంవత్సరం వాయిదా..!
అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎగ్జామ్స్ రద్దు చేయడానికి యూజీసీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కోవిడ్-19 కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లో జరిగే సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లోనూ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల టెక్నికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా మార్చేందుకు మంత్రిత్వశాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎగ్జామ్స్ పై సుప్రీంకోర్టులో గురువారం.. విచారణ జరగనుంది. ఎగ్జామ్స్ నిర్వహణపై విచారణ జరపనుంది అత్యున్నత […]

అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎగ్జామ్స్ రద్దు చేయడానికి యూజీసీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కోవిడ్-19 కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లో జరిగే సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లోనూ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల టెక్నికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా మార్చేందుకు మంత్రిత్వశాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎగ్జామ్స్ పై సుప్రీంకోర్టులో గురువారం.. విచారణ జరగనుంది. ఎగ్జామ్స్ నిర్వహణపై విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం. ఈ అంశంపై తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సీబీఎస్‌ఈ రేపు తెలపనుంది. సీబీఎస్‌ఈ నిర్ణయానికి అనుగుణంగా సాంకేతిక విద్య ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహణపై మానవ వనరుల శాఖ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.




