అమెరికా విమానయాన సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విమనాల్లో ఫేస్ మాస్కులను ధరించని ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరించనుంది. అటువంటి ప్రయాణికులను “నో ఫ్లై” జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాకి ఓకే చెప్పినవాటిలో అమెరికా దేశానికి చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, హవాయిన్ ఎయిర్‌లైన్స్, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ప్రయాణికులు తినేటపుడు, మంచినీరు తాగేటపుడు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందే ఫేస్ మాస్క్ లు ధరిస్తామని అంగీకారం తెలపాల్సి ఉంటుందని విమానయాన సంస్థలు పేర్కొంది.