Unique Wedding In Madhya Pradesh: ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యత కూడా అలాంటిదే. సమాజ భవిష్యత్తు మంచి వివాహా వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. ఇలాంటి పెళ్లిళ్లు కలకాలం నిలవాలని అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే వివాహ వేడుక సందర్భంగా భార్యా భర్తలు ఒకరిపై ఒకరు గౌరవం, ప్రేమతో కలిసి మెలిసి ఉండాలని వారితో చెప్పిస్తుంటారు.
అయితే మధ్యప్రదేశ్‌లో ఈ తతంగాన్ని కాస్త వెరైటీగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భగవాస్‌పురా తహశీల్ పరిధిలోని ధబ్లా అనే గ్రామంలో అర్సే, నైజా అనే జంటలకు ఈ నెల 15వ వివాహం జరిగింది. అందరి జంటల్లాగే వీరు కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండబోమని మాట ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే అందరిలా చేస్తే ఇది ప్రత్యేకంగా ఓ వార్త ఎందుకు అవుతుంది చెప్పండి. ఇక్కడే ఉంది అసలు పాయింట్… ఈ కొత్త జంట మాములుగా కాకుండా ఈ రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం రోజున ప్రతిజ్ఞ చేసినట్లుగానే రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
मध्य प्रदेश के खरगोन जिले में अनूठी शादी, वर-वधू ने ली संविधान की शपथ#mpnews #khargonenewshttps://t.co/NXxGOqcKWF pic.twitter.com/sguSFnYBLw
— NaiDunia (@Nai_Dunia) January 16, 2021
Also Read: Leopard Attack: తెలంగాణలో రెచ్చిపోతున్న వన్యమృగాలు.. తీవ్ర భయాందోళనలో భైంసా ప్రజలు..