పశువులకూ ఆధార్‌ కార్డు.. పాడిపోషకుల రాయితీల కోసమేనా..?

పాడిపశువులు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. ఇనాఫ్‌ ట్యాగ్‌ (INUPH TAG) (ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టివిటి అండ్‌ హెల్త్‌) పేరిట ప్రతి పశువుకు ప్రత్యేకయమైన సంఖ్యను కేటాయించి ట్యాగ్‌ వేయనున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాడిపశువులు, గొర్రెలు, మేకల కోసం ప్రవేశపెట్టే బీమా, ఇతర పథకాలు పెంపకందారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే […]

పశువులకూ ఆధార్‌ కార్డు.. పాడిపోషకుల రాయితీల కోసమేనా..?

పాడిపశువులు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. ఇనాఫ్‌ ట్యాగ్‌ (INUPH TAG) (ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టివిటి అండ్‌ హెల్త్‌) పేరిట ప్రతి పశువుకు ప్రత్యేకయమైన సంఖ్యను కేటాయించి ట్యాగ్‌ వేయనున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాడిపశువులు, గొర్రెలు, మేకల కోసం ప్రవేశపెట్టే బీమా, ఇతర పథకాలు పెంపకందారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల వారీగా ఇప్పటికే పశుసంవర్థక శాఖ సిబ్బంది 12 అంకెల ఆధార్‌ సంఖ్య ఉన్న ఇనాఫ్‌ ట్యాగ్‌లను పశువుల చెవులకు వేస్తున్నారు. పుట్టిన తర్వాత మూడు నెలలు దాటిన ప్రతి పశువుకు ఆధార్‌ సంఖ్యను ఇవ్వనున్నారు. మరో దఫాలో గొర్రెలు, మేకలకు కూడా వేయాలనేది రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇనాఫ్‌ ట్యాగ్‌ చేసిన పశువులకు సంబంధించిన రైతులకు పశువైద్యులు హెల్త్‌ కార్డు అందజేస్తారు. పశువుల ఆరోగ్య వివరాలతో పాటు మందులు ఎప్పుడు వాడాలో తెలియజేసే వివరాలను పొందుపరుస్తున్నారు. గర్భధారణ వివరాలు, పాల ఉత్పత్తి తదితర విషయాలను కూడా ఇందులో చేరుస్తారు. ట్యాగ్‌ వేసిన ప్రతి పశువు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐఎన్‌ఏపీహెచ్‌ వెబ్‌సైట్‌లో పశు ఆధార్‌ సంఖ్యను నమోదు చేస్తే ఆవు, గేదెకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్ఛు. గేదెలు, ఆవులు అమ్మకాలు జరిగితే ఆ వివరాలను ఆ పశువు ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌లో పశుయజమాని పేరును కూడా మార్చడం జరుగుతుంది. మూగజీవాలు అనారోగ్యంతో మృతి చెందితే మరణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందుకు వీలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పశుసంవర్థక శాఖ సిబ్బంది ట్యాగ్ నెంబర్ కేటాయింపును వేగవంతం చేశారు.