ఛ‌త్తీస్‌ఘ‌డ్ తొలి ముఖ్య‌మంత్రి అజిత్ జోగి కన్నుమూత

ఛ‌త్తీస్‌ఘ‌డ్ మొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి శుక్రవారం తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. గుండెపోటుకు గురైన ఆయన.. ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను పిలిపించగా.. జోగిని పరీక్షించి డాక్టర్లు గుండెపోటుగా నిర్ధారించారు. అనంతరం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. మరోవైపు.. అజిత్ […]

ఛ‌త్తీస్‌ఘ‌డ్ తొలి ముఖ్య‌మంత్రి అజిత్ జోగి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 4:51 PM

ఛ‌త్తీస్‌ఘ‌డ్ మొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి శుక్రవారం తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. గుండెపోటుకు గురైన ఆయన.. ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను పిలిపించగా.. జోగిని పరీక్షించి డాక్టర్లు గుండెపోటుగా నిర్ధారించారు. అనంతరం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు.

మరోవైపు.. అజిత్ కుమార్‌ జోగి ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. 2000 న‌వంబ‌రు నుంచి డిసెంబ‌రు 2003 వ‌ర‌కు ఆయన ఛ‌త్తీస్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు. రాష్ట్ర శాస‌న‌స‌భ స‌భ్యుడిగానే గాక పార్ల‌మెంటు స‌భ్యుడిగా కూడా ఆయ‌న ప‌ని చేశారు.

[svt-event date=”29/05/2020,4:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..