వదంతులను నమ్మకండి, రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ 8 పేజీల లేఖ, ఎం ఎస్ పీ ఫై మళ్ళీ హామీ

| Edited By: Pardhasaradhi Peri

Dec 17, 2020 | 7:16 PM

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన తెలుపుతున్న అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 8 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కనీస మద్దతు ధర (ఎం ఎస్ పీ) ని రద్దు చేస్తారంటూ కొన్ని రైతు సంఘాలు వ్యాప్తి..

వదంతులను నమ్మకండి, రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ 8 పేజీల లేఖ, ఎం ఎస్ పీ ఫై మళ్ళీ హామీ
Follow us on

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన తెలుపుతున్న అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 8 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కనీస మద్దతు ధర (ఎం ఎస్ పీ) ని రద్దు చేస్తారంటూ కొన్ని రైతు సంఘాలు వ్యాప్తి చెందింపజేస్తున్న రూమర్లను నమ్మవద్దని ఆయన కోరారు. ఇవి అబధ్ధాలని, వీటిని విశ్వసించవద్దని అన్నారు. ఎం ఎస్ పీ పై లిఖితపూర్వక హామీని ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ‘మీలో ఏర్పడిన అపోహలను తొలగించే బాధ్యత నాది..మీలో అనేక మంది రైల్వే పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు,… రైళ్లను అడ్డగిస్తున్నారు.. అయితే మన దేశ సరిహద్దులను రక్షిస్తున్న సైనికులకు ఈరైళ్ల ద్వారా వెళ్లే రేషన్ సరకులు వారికి చేరకుండా నిలిచిపోతున్నాయి.. దయచేసి సమస్యను అర్థం చేసుకొండి’ అని ఆయన కోరారు. కేంద్రానికి, రైతులకు మధ్య ‘అబధ్ధాల గోడ’ నిర్మించడానికి కుట్ర జరుగుతోంది అని తోమర్ పేర్కొన్నారు.  మీ సమస్య పరిష్కారానికి పానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని విస్మరించకండి అని ఆయన గుర్తు చేశారు.

అటు-రైతుల ఆందోళనపై చర్చించేందుకు హోం మంత్రి అమిత్ షా గురువారం తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్ లతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ దాదాపు రెండు గంటల పాటు జరిగింది.

ఇలా ఉండగా… కోర్టులో తమ వాదన వినిపించేందుకు నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.  వీరి తరఫున అడ్వొకేట్లు  ప్రశాంత్ భూషణ్, దుశ్యంత్ దవే, హెచ్.ఎస్,ఫూల్కా, కొలిన్ గోల్ సాల్వేస్ వాదించే అవకాశాలున్నాయి.