కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్ యూజర్లకు కూడా అందుబాటులోకి ఆ ఆప్షన్.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుండడమే వాట్సాప్ పాపులారిటీ కారణంగా చెప్పవచ్చు. ఫేస్‌బుక్ కొనుగోలు తర్వాత వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారింది. ఇదిలా ఉంటే వాట్సాప్ తాజాగా వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో డౌన్‌లోడ్‌లతో దూసుకెళుతోందీ టెక్ దిగ్గజం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుండడమే వాట్సాప్ పాపులారిటీ కారణంగా చెప్పవచ్చు. ఫేస్‌బుక్ కొనుగోలు తర్వాత వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారింది. ఇదిలా ఉంటే వాట్సాప్ తాజాగా వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌లో ఇప్పటి వరకు ఆడియో, వీడియా కాల్స్ సదుపాయం కేవలం మొబైల్ వెర్షన్‌లోనే అందుబాటులో ఉండేవి. డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఈ సదుపాయం లేదు. ఇప్పుడు ఈ సమస్యను అదగమించడానికి వాట్సాప్ వెబ్ యూజర్లకు కూడా వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే డెస్క్‌టాప్ నుంచి కూడా ఎంచక్కా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ బెటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ వర్గాలు తెలిపాయి.
ఈ విషయమై కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘బీటా ఫీచర్ కావడంతో ప్రస్తుతం కొద్దిమంది యూజర్లు మాత్రమే ఈ కొత్త ఫీచర్‌ను వినియోగించుకునేందుకు అనుమతిచ్చాం. త్వరలోనే మిగతా వారికి కూడా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు అధిక ప్రాధాన్యం ఉంది’ అని చెప్పుకొచ్చారు. ఇక మొబైల్ వెర్షన్ మాదిరిగానే వాయిస్, వీడియో కాల్ బటన్ ఉంటుందని చూపించే కొన్ని స్క్రీన్‌షాట్లను బ్లాగ్‌లో షేర్ చేసింది. వాట్సాప్ వెబ్ / డెస్క్‌టాప్‌కు కాల్ వచ్చినప్పుడు ప్రత్యేక విండో పాపప్ డిస్‌ప్లే అవుతుంది.. దాని ఆధారంగా కాల్ లిఫ్ట్ చేయడం లేదా క్యాన్సిల్ చేయడం ఎంచుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోం పెరుగుతోన్న తరుణంలో ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీలు వర్గాలు భావిస్తున్నాయి.




