కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఈసీ నోటీసులు

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నెల 30న మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ నినాదాలు చేస్తూ ఆ సభకు వచ్చిన వారితో ప్రతి నినాదాలు చేయించారు. దేశద్రోహులను కాల్చి పారేయాలి అనే అర్థంతో నినాదాలు చేశారు. అయితే […]

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఈసీ నోటీసులు
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 10:37 PM

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నెల 30న మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ నినాదాలు చేస్తూ ఆ సభకు వచ్చిన వారితో ప్రతి నినాదాలు చేయించారు. దేశద్రోహులను కాల్చి పారేయాలి అనే అర్థంతో నినాదాలు చేశారు. అయితే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల సంఘం.. అనురాగ్ ఠాకూర్‌కు నోటీసులు పంపించింది. జనవరి 30, మధ్యాహ్నం 12 గంటల లోపు తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్‌ను ఆదేశించింది.