బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంచల విజయం నమోదు చేసింది. బీజేపీ సొంతంగానే పూర్తి మెజారిటీ సాధించడంతో ఇవాళ కూడా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 16వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపుతారు. 16వ లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ తేదీలోపే 17వ లోక్‌సభ కొలువుతీరాల్సి ఉంటుంది.