Women Murdered: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన రహదారిపై మహిళ దారుణ హత్య.. పూర్తిగా కాలిపోయిన స్థితిలో

శంషాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు దుండగలు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై  గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడంతో...

Women Murdered: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన రహదారిపై మహిళ దారుణ హత్య.. పూర్తిగా కాలిపోయిన స్థితిలో

Updated on: Jan 08, 2021 | 1:19 PM

Women Murdered:  శంషాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు దుండగలు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై  గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడంతో కంగారుపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ ఉన్నట్లు తెలిపారు. క్లూస్ టీ‌మ్‌ను స్పాట్‌కు పిలిపించి ఆధారాలు సేకరించారు.

చనిపోయిన మహిళ వయస్సు 35-40 మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీ సేకరించారు. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించిన శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read :

APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే !

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు