‘మహా’ సీఎంకు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు…

|

Sep 06, 2020 | 5:38 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేను దావూద్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ముంబైలోని ఆయన నివాసం మాతోశ్రీని పేల్చేస్తామంటూ దావూద్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది.

మహా సీఎంకు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు...
Follow us on

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేను దావూద్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ముంబైలోని ఆయన నివాసం మాతోశ్రీని పేల్చేస్తామంటూ దావూద్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. దీనితో పోలీసులు మాతోశ్రీ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దుబాయ్ నుంచి ఉద్దవ్‌కు మూడుసార్లు ఫోన్ కాల్స్ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. (Uddav Thackreay Receives Threat Call From Dawood Gang)

ఈ విషయంపై ఆ రాష్ట్ర హోం మినిస్టర్ శంభురాజే దేశాయ్ స్పందిస్తూ.. ”శివ్ సైనిక్స్ ఇలాంటి బెదిరింపు కాల్స్‌కు భయపడరని.. దీనికి బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని చెప్పారు. అలాగే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తును మొదలుపెట్టడమే కాకుండా.. కాల్స్ లొకేషన్‌ను ట్రేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, చాలా రోజుల తర్వాత ముంబైలో దావూద్ గ్యాంగ్ మళ్లీ యాక్టివేట్ కావడంతో కలకలం రేగుతోంది. దావూద్ గ్యాంగ్ కార్యకలాపాలు ముంబైతో పాటు దుబాయ్‌లో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.