తీవ్ర సంక్షోభంలోకి రవాణా వ్యవస్థ.. ఉబెర్‌ ముంబై ఆఫీసు మూసివేత..?

| Edited By:

Jul 04, 2020 | 10:38 PM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌  కారణంగా  ప్రపంచవ్యాప్తంగా  రవాణా వ్యవస్థ తీవ్ర

తీవ్ర సంక్షోభంలోకి రవాణా వ్యవస్థ.. ఉబెర్‌ ముంబై ఆఫీసు మూసివేత..?
Follow us on

Uber shuts Mumbai office: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌  కారణంగా  ప్రపంచవ్యాప్తంగా  రవాణా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి  కూరుకు పోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ క్రమంలో  ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా  ఉద్యోగులను  తొలగించిన క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్‌ ముంబైలోని తన కార్యాలయాన్ని మూసివేసినట్లు  సమచారం.

కంపెనీ నికర నష్టాలూ భారీగా పెరగడంతో.. ఉద్యోగులపై వేటు తప్పడంలేదు. అయితే ముంబైలో సేవలను మాత్రం  కొనసాగించనుంది. ముంబైలోని ఉబెర్‌  ఉద్యోగులు ఇంటి నుండి డిసెంబర్ వరకు పనిచేయనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఉబెర్ ప్రతినిధి నిరాకరించారు. ప్రపంచవ్యాప్తంగా 6,700 మంది,  దేశీయంగా 600 మందిని తొలగించిన దాదాపు నెల తరువాత  ఈ పరిణామం చోటు చేసుకోనుంది.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం