1953 తరువాత అమెరికాలో తొలిసారి ఒక మహిళకు మరణశిక్ష !

|

Oct 18, 2020 | 7:53 PM

1953 తర్వాత అమెరికా ఫెడరల్ జైలులో ఉన్న ఒక మహిళా ఖైదీకి మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు సమాచారం. లీసామోంట్‌గోమరీ అనే మహిళ 2004లో గర్భిణీ స్త్రీని చంపి...

1953 తరువాత అమెరికాలో తొలిసారి ఒక మహిళకు మరణశిక్ష !
Follow us on

1953 తర్వాత అమెరికా ఫెడరల్ జైలులో ఉన్న ఒక మహిళా ఖైదీకి మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు సమాచారం. లీసామోంట్‌గోమరీ అనే మహిళ 2004లో గర్భిణీ స్త్రీని చంపి, ఆమె గర్భం కోసి బిడ్డను ఎత్తుకెళ్లడం వంటి నేరాలకు పాల్పడింది. ఈ కేసులో ఆమెకు డిసెంబర్ 8న పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వనున్నారు. అమెరికా ఫెడరల్ కోర్టు చివరగా 1953లో బోనీ హీడీ అనే మహిళకు మరణ శిక్ష విధించింది. 1999లో ఇద్దరు మినిస్టర్స్‌ను హత్య చేసిన బ్రాండన్ బెర్నార్డ్ కు కూడా ఇదే ఏడాది డిసెంబర్‌లో మరణశిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. మోంట్‌గోమరీ, బ్రాండన్ బెర్నార్డ్ పాశవికమైన హత్యలు చేశారని అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ పేర్కొన్నారు. ఫెడరల్ కోర్ట్ మరణశిక్షలను తిరిగి ప్రారంభించవచ్చని ట్రంప్ సర్కార్ పోయిన ఏడాది న్యాయ శాఖకు సూచించింది. కాగా, చిన్నప్పుడు కొట్టడం వల్ల లీసామోంట్‌గోమరీకు మెదడు పాడయ్యిందని, ఆమె మానసిక సమస్యల్లో ఉన్నారని, ఆమె మరణశిక్ష రద్దు చేయాలని మోంట్‌గోమరీ లాయర్లు కోరుతున్నారు.

Also Read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్ !