ఇద్దరు దక్షిణాఫ్రికా ప్లేయర్స్‌కు కరోనా పాజిటివ్..!
దక్షిణాఫ్రికా పురుషుల జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఓ ప్రకటనలో వెల్లడించింది.

Two South Africa players test positive Corona: దక్షిణాఫ్రికా పురుషుల జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ ఆటగాళ్ళిద్దరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడించింది. ప్రోటోకాల్ ప్రకారం డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది.
“పాజిటివ్ వచ్చిన ఇద్దరు ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలు ఏమి లేవు. శిబిరానికి హాజరు కాలేకపోయిన వారందరూ కూడా వర్చువల్‌గా బోర్డుతో సంప్రదిస్తారు. తనకు రెండో బిడ్డ పుట్టినందుకు డుప్లెసిస్ శిబిరానికి హాజరు కాలేకపోయాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ లో జాతి వివక్షను పెరగకుండా అడ్డుకునేందుకు ఆటగాళ్లల్లో అవగాహన కల్పించడానికి ఆగస్టు 18-22 వరకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..
మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..
డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..
