కాంగ్రెస్‍కు గుడ్‍బై చెప్పిన సీనియర్ నేత‌ చిత్తరంజన్ దాస్

| Edited By: Anil kumar poka

Mar 22, 2019 | 6:47 PM

తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 22వ తేదీ శుక్రవారం ఏకంగా ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాగా మరొకరు సీనియర్ నేత, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఛైర్మన్, మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చిత్త రంజన్ దాస్ ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. […]

కాంగ్రెస్‍కు గుడ్‍బై చెప్పిన సీనియర్ నేత‌ చిత్తరంజన్ దాస్
Follow us on

తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 22వ తేదీ శుక్రవారం ఏకంగా ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాగా మరొకరు సీనియర్ నేత, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఛైర్మన్, మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చిత్త రంజన్ దాస్ ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. ఈయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. సామాజిక న్యాయం లోపించిందని, సీనియర్ నాయకులకు గౌరవం లేదని చిత్త రంజన్ దాస్ తెలిపారు.

ఇక చిత్తరంజన్ దాస్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ నేత 1989లో కల్వకుర్తి నుండి ఎన్టీఆర్‌ని ఓడించి సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తరంజన్ దాస్ పేరు మార్మోగిపోయింది. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో ఈయన పనిచేశారు. ఆ తర్వాత 1994లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి పార్టీ టికెట్ ఇవ్వలేదు.