AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారీ బోల్తాపడి ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండలం గోకపసులబాద్ శివారులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

లారీ బోల్తాపడి ఇద్దరు మృతి
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 7:42 PM

Share

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండలం గోకపసులబాద్ శివారులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గోకపసులబాద్ గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన లారీమూలమలుపులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రావుల పల్లి గ్రామానికి చెందిన నర్సప్ప (38) అబ్దుల్ (35)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.