RTC Bus Accident: హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. బ్రేకులు ఫెయిలై.. మంటలు చెలరేగి.. ఇద్దరు దుర్మరణం..
రోడ్లపై ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎటు వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోవడం...
రోడ్లపై ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎటు వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోవడం పక్కా. ప్రైవేటు వాహనాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరగుతాయనుకుని.. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే వారికి కూడా ఇలాంటి ప్రమాదాలు తప్పడం లేదు. ప్రయాణీకులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ.. వారిని ప్రమాదాల బారిన పడేస్తోంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అతి వేగం కారణంగా జరిగిన ఈ ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. రహదారిపై వేగంగా దూసుకొచ్చిన మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్‌ఆర్‌టీసీ)కు చెందిన ఓ బస్సు ముందున్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నాసిక్ – పుణె రహదారిపై పాల్సే గ్రామం వద్ద జరిగింది.
ఎంఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు.. పుణె జిల్లాలోని రాజ్‌గురునగర్ నుంచి నాసిక్‌కు వెళుతోంది. పాల్సే గ్రామం సమీపంలోకి చేరుకోగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పి ముందుకు దూసుకుపోయింది. నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎస్‌యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. రెండు బస్సుల మధ్య రెండు బైకులు చిక్కుకుని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
CCTV footage of ST bus accident at Palase on Nashik-Pune highway#Accident #CCTV #Nashik_pune_Highway#Nashik #Sinnar #Palse pic.twitter.com/9BaKJ0JMUo
— पाटील ? (@PareshPatil11) December 8, 2022
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యారు. బస్సు అద్దాలు పగలగొట్టి 43 మందిని కాపాడారు. నాసిక్ అగ్ని మాపక విభాగం హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసింది. బ్రేకులు పని చేయక ప్రమాదానికి కారణమైన బస్సులోని కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి