AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోమయంలో ఈ ఇద్దరు..ఎందుకంటే?

రాజధానిని మూడుగా విభజించటం ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిలో ప్రజాప్రతినిధులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఏపీ రాజధాని అమరావతిని, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటుచేశారు. ఇక మంగళగిరిలోని కొన్ని గ్రామాలను సీడ్‌ కాపిటల్‌లో కలిపారు. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ రాజధాని విస్తరించింది. ప్రస్తుతం రాజధానిని మూడుగా విభజించే ప్రతిపాదనలపై రెండు నియోజకవర్గాల్లోని జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలోని 29 గ్రామాల […]

అయోమయంలో ఈ ఇద్దరు..ఎందుకంటే?
Rajesh Sharma
|

Updated on: Dec 23, 2019 | 6:53 PM

Share

రాజధానిని మూడుగా విభజించటం ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిలో ప్రజాప్రతినిధులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఏపీ రాజధాని అమరావతిని, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటుచేశారు. ఇక మంగళగిరిలోని కొన్ని గ్రామాలను సీడ్‌ కాపిటల్‌లో కలిపారు. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ రాజధాని విస్తరించింది. ప్రస్తుతం రాజధానిని మూడుగా విభజించే ప్రతిపాదనలపై రెండు నియోజకవర్గాల్లోని జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాలలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. అక్కడి నుంచి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ ఓడిపోవడం సంచలనం సృష్టించింది. మొదటిసారి గెలుపొందిన శ్రీదేవి అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ చురుకుగా పాల్గొని తన గళాన్ని వినిపించారు. అయితే అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సిఎం జగన్‌, రాజధానిని విభజించి మూడు చోట్లకు తరలించే అవకాశం ఉందని చెప్పటంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 29 గ్రామాల జనం రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి కనీసం రైతుల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక ఇటు రైతులకు నచ్చచెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమె తుళ్లూరు మండలంవైపు వెళ్లడం లేదు. గత ఎన్నికల్లో ఈ మండలంలో టీడీపీ అభ్యర్థికి 7 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. రాజధానిని పూర్తిగా ఇక్కడే ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో రాజధానిపై మౌనమే సమాధానమన్నట్టు వ్యహరిస్తున్నారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా కూడా అదే విధంగా ఉంది. గత ప్రభుత్వం నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్కే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంపై మౌనంగా ఉండిపోయారు. పరిపాలన రాజధానిని తరలించాలన్న ప్రతిపాదనను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆర్కే మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో అక్కడి టీడీపీ కూడా ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆర్కే కనిపించటం లేదంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు టిడిపి నేతలు. మంగళగిరి మండలంతో పాటు, తాడేపల్లిలోని మరికొన్ని గ్రామాలు సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోనే ఉన్నాయి. గతంలో రాజధానిలో అవినీతి జరిగిందని గట్టిగా మాట్లాడిన ఆర్కే.. ప్రజల ఆగ్రహావేశాలు చల్లారే వరకూ మౌనంగా ఉండాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మున్ముందు సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో తెలియడంలేదు. మరోవైపు రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల ముందు రాజధానిని మార్చం అని మేనిఫెస్టోలో ప్రకటించటం వల్లే ఈ రెండు చోట్ల వైసీపీ గెలిచిందని టీడీపీ నేతలు అంటున్నారు. రాజధానిని మార్చిన తర్వాత, గుంటూరు జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ చేస్తున్న డిమాండ్‌తో ఈ ఇద్దరూ మరింత సంకటంలో పడ్డారు.