AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో విరుచుకుపడిన పిడుగులు

ఉత్తరాధిని పిడుగులు వణికిస్తున్నాయి. ఆ మధ్య పిడుగులు విరుచుకుపడటంతో ఒక్క రోజే బీహార్‌లో పదుల సంఖ్యలో బలయ్యారు. ఇప్పుడు ఓ వైపు కరోనా మహమ్మారికి జనం వణికిపోతుండగా.. భారీ వర్షాలకుతోడు పిడుగులు భయపెడుతున్నాయి...

యూపీలో విరుచుకుపడిన పిడుగులు
Sanjay Kasula
|

Updated on: Sep 22, 2020 | 9:43 PM

Share

Lightning Strike : ఉత్తరాధిని పిడుగులు వణికిస్తున్నాయి. ఆ మధ్య పిడుగులు విరుచుకుపడటంతో ఒక్క రోజే బీహార్‌లో పదుల సంఖ్యలో బలయ్యారు. ఇప్పుడు ఓ వైపు కరోనా మహమ్మారికి జనం వణికిపోతుండగా.. భారీ వర్షాలకుతోడు పిడుగులు భయపెడుతున్నాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అజాంఘ‌ర్ జిల్లాలో పిడుగుప‌డి ఇద్ద‌రు ప‌శువుల కాప‌రులు మృతిచెందారు. స‌గ్రీ తాలూకా రౌనాపార్ ఏరియాలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఎప్పటిలాగే మంగ‌ళ‌వారం కూడా ప‌శువుల‌ను మేపుతుండగా సాయంత్రం ఒక్క‌సారిగా ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం మొద‌లవ‌డంతో ప‌క్క‌నే ఉన్న చెట్టుకింద‌కు వెళ్లారు. కాసేపటికే ఆ చెట్టుపై పిడుగు ప‌డ‌టంతో ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌క్క‌నే పొలాల్లో ప‌నిచేస్తున్న వారు చూసి పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో.. వారు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాల‌ను కుటుంబ సభ్యులకు అందించారు.