ఇండియా లో ఆ ‘భయం’, బ్రిటన్ నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్, స్ట్రెయిన్ ముప్పు లేదంటున్ననిపుణులు

| Edited By: Anil kumar poka

Dec 23, 2020 | 7:55 AM

బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికుల్లో 20 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వివిధ విమానాశ్రయాల్లో దిగుతున్న వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

ఇండియా లో ఆ భయం, బ్రిటన్ నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్, స్ట్రెయిన్ ముప్పు లేదంటున్ననిపుణులు
Britain adds india to travel red list
Follow us on

బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికుల్లో 20 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వివిధ విమానాశ్రయాల్లో దిగుతున్న వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. కానీ ఇండియాలో ఇప్పటివరకు కొత్త స్ట్రెయిన్ కనబడలేదని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూకే నుంచి సోమ, మంగళవారం రాత్రి ఇండియాలోని విమానాశ్రయాల్లో దిగిన వారిలో 20 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు కోల్ కతా, మరికొందరు అహమ్మదాబాద్, అమృత్ సర్ ఎయిర్ పోర్టుల్లో దిగారు. వీరంతా లండన్ నుంచి ఎయిరిండియా విమానాల్లో దిగినవారే ! అయితే నీతి ఆయోగ్ డైరెక్టర్ వీకే.పాల్ మాత్రం మన దేశంలో ఇప్పటివరకు కొత్త స్ట్రెయిన్ కనబడలేదని తెలిపారు. ముందు జాగ్రత్తచర్యగా అన్ని వివరాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ డెవలప్ మెంట్ లోకొత్త వైరస్ ప్రభావం ఉండబోదన్నారు. యూకే లో తలెత్తిన ఈ వైరస్ కారణంగా ఫాటలిటీ (మరణాలు) లేవని, ఆందోళన అనవసరమని పాల్ పేర్కొన్నారు.

అటు యూకే తో బాటు సౌతాఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్ఛే ప్రయాణికులపై తప్పనిసరిగా అన్ని టెస్టులూ నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం  అధికారులను ఆదేశించింది. వీరు ఇక్కడికి చేరగానే 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఢిల్లీ, ఒడిశా వాటి రాష్ట్రాలు కూడా ఇలా కొత్త మార్దర్శక సూత్రాలను జారీ చేయనున్నాయి.