అమెరికాలో ఈటా హరికేన్… 21 మంది మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో వేడెక్కితే.. మరోవైపు భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఈటా హరికేన్ వల్ల అమెరికాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో 21 మంది మృత్యువాతపడ్డారు.

అమెరికాలో ఈటా హరికేన్...  21 మంది మృతి, వందలాది మంది నిరాశ్రయులు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 6:27 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో వేడెక్కితే.. మరోవైపు భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఈటా హరికేన్ వల్ల అమెరికాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో 21 మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షాల ధాటికి వరదనీటితో వీధులన్నీ నదులుగా మారాయి. గ్వాటెమాలలో పలు ఇళ్లు బురదనీటిలో కూరుకుపోయాయి. సెంట్రల్ గ్యాటెమాలలోని శాన్ పెడ్రో కార్చాలో కార్లు వరదనీటిలో మునిగిపోయాయి. తుపాన్ విపత్తు వల్ల హూండురాస్ భారీనష్టం సంభవించిందని స్థానిక అధికారులు ప్రకటించారు. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి రిస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. స్పీడ్ బోట్లు, హెలికాప్టర్ల సాయంతో ముంపునకు గురైనవారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని హోండురాన్ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ చెప్పారు. అమెరికాను తాకిన తీవ్రమైన తుపాన్లలో నాలుగోవ హరికేన్‌గా మంగళవారం గంటకు 150 మైళ్ల గాలులతో తీరాన్ని తాకింది. గ్వాటెమాల, పనామా ప్రాంతాల్లో చాలామంది తప్పిపోయారు. వరదనీరు వెల్లువెత్తుతుండటంతో చాలాచోట్ల ప్రజలు రక్షణ కోసం భవనం పైకప్పులపై చిక్కుకొని రక్షణ కోసం ఎదురుచూస్తున్నారు.

అటు, సెంట్రల్ అమెరికన్ దేశంలో తుపాన్ విపత్తు వల్ల కురుస్తున్న భారీవర్షాలతో గ్వాటెమాల సిటీలో నలుగురు మరణించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. తుపాన్ వల్ల 33,282 మంది నిరాశ్రయులయ్యారని, తుపాన్ బాధతులను సహాయ శిబిరాలకు తరలించామని తుపాన్ విపత్తు నిర్వహణ జాతీయ సమన్వయకర్త కాన్రెడ్ చెప్పారు. రాత్రి రెండు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల నలుగురు మరణించారని కాన్రెడ్ పేర్కొన్నారు. మరోవైపు, గ్వాటెమాల నగరంలో తుపాన్ ధాటికి 92 ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఉత్తర హోండురాస్ లోని లాసిబా నౌకాశ్రయానికి దక్షిణాన 145 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది. ఈ తుపాన్ కరేబియన్ సముద్రం వైపు వెళుతుందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది.

Latest Articles
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్