మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ‘లోక్ భవన్’ భవనంలో ఏర్పాటు చేశారు. ఆయన జన్మదినం అయిన డిసెంబర్ 25 న అధికారికంగా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. నిన్న రాత్రి లోక్ భవన్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు సమాచారం. కాగా.. ప్రధాని కార్యాలయం దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. జైపూర్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి రాజ్ కుమార్ పండిట్ ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం రాష్ట్రంలో ఎత్తైన విగ్రహం కానుంది.