సీనియర్ జర్నలిస్ట్ పొరబాటు, వెంటనే ట్వీట్ డిలీట్

| Edited By: Anil kumar poka

Aug 13, 2020 | 12:39 PM

మాజీ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారంటూ నేషనల్ న్యూస్ ఛానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేయగా..అది  ట్రోల్ కావడంతో ఆయన వెంటనే ఆ ట్వీట్ ని తొలగించారు. ఇది ఫేక్ న్యూస్ అని నెటిజన్లు ఆయనను తప్పు పట్టారు.

సీనియర్ జర్నలిస్ట్ పొరబాటు, వెంటనే ట్వీట్ డిలీట్
Follow us on

మాజీ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారంటూ నేషనల్ న్యూస్ ఛానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేయగా..అది  ట్రోల్ కావడంతో ఆయన వెంటనే ఆ ట్వీట్ ని తొలగించారు. ఇది ఫేక్ న్యూస్ అని నెటిజన్లు ఆయనను తప్పు పట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ తప్పుడు ట్వీట్ గురించి తెలియగానే.. ప్రణబ్ కుమారుడు, కుమార్తె కూడా ఆయన హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చారు. వదంతులను నమ్మరాదని వారు  కోరారు. తన తండ్రి ఇంకా జీవించే ఉన్నారని, ఊహాగానాలు, ఫేక్ న్యూస్ ని ప్రముఖ జర్నలిస్టులు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడం చూస్తే.. ఇండియాలో మీడియా తప్పుడు వార్తల ఫ్యాక్టరీగా మారిపోయినట్టు కనిపిస్తోందని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. అలాగే ప్రణబ్ కుమార్తె శర్మిష్ట కూడా తమ తండ్రి హెల్త్ పై రూమర్స్ ని నమ్మరాదని కోరారు.

ప్రణబ్ ముఖర్జీ ఆసుపత్రిలో కోమాలో ఉన్నారని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.