శ్రీవారి భక్తులకు తీపికబురు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని యోచిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సెప్టెంబర్ నుంచి 30వేల మందిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి రేపు జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం 9వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. కొవిడ్ 19 వైరస్ కారణంగా జులై 16 […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:28 pm, Thu, 27 August 20
శ్రీవారి భక్తులకు తీపికబురు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని యోచిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సెప్టెంబర్ నుంచి 30వేల మందిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి రేపు జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం 9వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. కొవిడ్ 19 వైరస్ కారణంగా జులై 16 నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.