టీటీడీ కీలక నిర్ణయం.. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారికీ శ్రీవారి దర్శనం

|

Dec 11, 2020 | 9:07 PM

శ్రీవారి దర్శనం విషయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారినీ

టీటీడీ కీలక నిర్ణయం.. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారికీ శ్రీవారి దర్శనం
Ttd rooms
Follow us on

శ్రీవారి దర్శనం విషయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారినీ ఇకనుంచి తిరుమల వెంకన్న దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అనౌన్స్ చేసింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. స్వీయ నియంత్రణ పాటిస్తూ, కరోనా జాగ్రత్తలతో ఎవరైనా దర్శనం చేసుకోవచ్చని పేర్కొంది. వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ల సౌకర్యం లేదని వివరించింది.

కరోనా లాక్ డౌన్ అనంతరం తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం తిరిగి తెరుచుకున్నాక పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారిని శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించలేదు. తాజా నిర్ణయంతో వారికీ శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..