ఎస్ఎంఎస్ పంపండి.. ఉచిత దర్శనం టికెట్ పొందండి.. టీటీడీ వినూత్న ఆలోచన..

|

Jun 08, 2020 | 3:47 PM

తిరుపతిలోని స్థానిక ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు కొత్తగా ఎస్ఎంఎస్ ద్వారా ఉచిత దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఈ నూతన విధానం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.

ఎస్ఎంఎస్ పంపండి.. ఉచిత దర్శనం టికెట్ పొందండి.. టీటీడీ వినూత్న ఆలోచన..
Follow us on

కరోనా వైరస్‌ కారణంగా ప్రతీ వ్యవస్థలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్నీ కూడా ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అన్‌లాక్‌ 1 నేపధ్యంలో ఏపీలోని అన్ని దేవాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. టీటీడీ కూడా తిరుపతిలో ఉన్న స్థానిక ఆలయాలన్నీ తెరిచింది.

ఇక ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత టికెట్లను ఇవ్వడంతో పాటు http://tirupatibalaji.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. అంతేకాక ఆలయాల్లో మిషన్ల నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా దర్శనం టికెట్లు జారీ చేస్తోంది. ప్రతీ ఆలయానికి ఓ కోడ్‌ను సూచించిన టీటీడీ ఎస్ఎంఎస్ పంపేటప్పుడు.. ఆ ఆలయం కోడ్‌తో పాటు దర్శనం చేసుకోవాలనుకునే తేదీ, భక్తుల సంఖ్యను వెల్లడించాలని తెలిపింది. అన్ని వివరాలతో 9321033330 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలని టీటీడీ సూచించింది. కాగా, ఆలయాలకు సంబంధించి కోడ్స్ ఈ విధంగా ఉన్నాయి.

  1. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూర్- SVP
  2. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం- SVS
  3. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలయగుంట- SVA
  4. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి- SVG
  5. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి- SVK

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

కేంద్రం సంచలనం.. మహిళల వివాహ వయసు పెంపు?

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

అప్పుడు సచిన్‌ను ఔట్ చేశాక.. చంపుతామని బెదిరించారు..