జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్

దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి ఆలయాలు నిర్మించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్

Updated on: Aug 26, 2020 | 6:44 PM

దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి ఆలయాలు నిర్మించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. ఈ మేరకు గతంలో తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే జమ్మూ ప్రభుత్వానికి ఆలయ నిర్మాణంపై సమగ్ర నివేదికను టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే జమ్మూలో ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని టీటీడీకి చూపించారు జమ్మూ అధికారులు. టీటీడీ అధికారుల నివేదికను పరిశీలించిన అనంతరం జమ్మూ ప్రభుత్వం అనుమతితో ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రూ.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్న ఆయన.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనూ శ్రీవారి ఆలయం నిర్మాణాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.