AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనాను జ‌యించ‌డ‌మే మ‌నంద‌రి ధ్యేయంః నంద‌మూరి బాల‌కృష్ణ‌

క‌రోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్ర హీరో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు బాధ్య‌త‌గా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే బాధ్య‌తాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు..

క‌రోనాను జ‌యించ‌డ‌మే మ‌నంద‌రి ధ్యేయంః నంద‌మూరి బాల‌కృష్ణ‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2020 | 6:29 PM

Share

క‌రోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్ర హీరో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు బాధ్య‌త‌గా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే బాధ్య‌తాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే ‌వ్యాక్సిన్ రావాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు. అలానే కరోనా పట్ల భయం వదలి కరోనాను జయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు ఉద‌యం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌కు మహేశ్వర మెడికల్ కాలేజి హాస్పిటల్, సంగారెడ్డి వారు కోవిడ్ రక్షణ కవచాలైన PPE కిట్స్, N95 మాస్క్ లు అందజేశారు. వీటిని హాస్పిటల్ తరపున బాల‌కృష్ణ స్వయంగా TGS మహేష్ చేతుల మీదుగా స్వీకరించారు. మొత్తం 1000 PPE కిట్లు, 1000 N95 మాస్క్‌లను ఈ సందర్భంగా మహేశ్వర మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సిబ్బందికి అందజేశారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ కోవిడ్ మహమ్మారితో చేస్తోన్న పోరాటంలో మహేష్ చేస్తున్న సహాయం ఎంతో మేలు కలిగిస్తోందని ప్రశంసించారు. మెడికల్ కాలేజీగా వైద్య చికిత్సకే పరిమితం కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ.. మహేష్ తన వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కోవిడ్ కారణంగా క్యాన్సర్ చికిత్స నిలిపివేయలేమని ఈ విషయంలో వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా హాస్పిట‌ల్ త‌ర‌పున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని చికిత్సకు వచ్చే ప్రతి వ్యక్తిని ముందుగా స్క్రీన్ చేస్తున్నామని ఒక వేళ ఎవరిపైనన్నా సందేహం వస్తే వారిని పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మహేశ్వర మెడికల్ కాలేజీ, హాస్పిటల్ చేస్తున్న ఈ సహాయం క్యాన్సర్ హాస్పిటల్ కోవిడ్ పై చేస్తున్న పోరాటానికి ఎంతో సహాయకారిగా నిలుస్తుందన్నారు.

Read More:

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

Follow Us
గంగా సప్తమి రోజు ఈ పని తప్పక చేయండి.. గోమాత కృపతో ధనవర్షం ఖాయం!
గంగా సప్తమి రోజు ఈ పని తప్పక చేయండి.. గోమాత కృపతో ధనవర్షం ఖాయం!
జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...
జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?
సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!