తిరుపతి ఎంపీ ఉపఎన్నిక: జనవరి 6వ తేదీ నుంచి వైసీపీ డోర్ టు డోర్ క్యాంపెయిన్, వైవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
తిరుపతి ఎంపీ ఉపఎన్నికల నేపథ్యంలో జనవరి ఆరో తేదీ నుంచి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు...
తిరుపతి ఎంపీ ఉపఎన్నికల నేపథ్యంలో జనవరి ఆరో తేదీ నుంచి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదన్న ఆయన..త్వరలోనే అభ్యర్థిని సీఎం జగన్ స్వయంగా ప్రకటిస్తారని తెలిపారు. పార్టీకోసం పని చేసిన వారికి సీట్ ఇస్తారని, జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు తమ పార్టీని గెలిపిస్థాయని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఏమని చెప్పి జనాల దగ్గరకు వెళ్లి ఓట్లు అడుగుతాయని ఆయన ప్రశ్నించారు. ఉపఎన్నికపై ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ రావాలని నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో వార్డు స్థాయిలో ఇన్ ఛార్జ్ లను నియమించామని నేతలు టీవీ9కు వెల్లడించారు.