దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ…

భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఇరిగేషన్‌, వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులతో ..

దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ...

Updated on: Aug 27, 2020 | 7:26 PM

భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఇరిగేషన్‌, వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులతో తెలంగాణ రాష్ట్రం భారత దేశ ధాన్యాగారంగా ఎదుగుతున్నదన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం  వర్చువల్‌ విధానం ద్వారా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ ఛాన్సలర్‌ ఉపన్యాసం రాజ్‌భవన్‌ నుంచి ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, మిషన్‌భగీరథ, చేపల పెంపకం, గొర్రెల పంపిణీ, రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలతో దేశ ధాన్యాగారంగా తెలంగాణ అభివృద్ది చెందుతున్నదని అన్నారు. స్నాతకోత్సవం ద్వారా పట్టాలు పొందుతున్న విద్యార్ధులు, పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధనలతో వ్యవసాయ రంగ సుస్ధిరతకుపాటుపడాలని పిలుపునిచ్చారు.