మున్సిపల్ ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు త్వరలో శుభవార్త

|

Aug 26, 2020 | 9:48 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల బాటపట్టారు. మున్సిపల్ ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త ప్రకటించనుంది. మున్సిపల్ శాఖలో సంస్కరణలు, సమూల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంతకాలం నామమాత్రపు జీతాలతో కాలం వెల్లదీసిన దినసరి వేతన సిబ్బందిని పర్మినెట్ చేస్తేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

మున్సిపల్ ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు త్వరలో శుభవార్త
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల బాటపట్టారు. మున్సిపల్ ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త ప్రకటించనుంది. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్.. మున్సిపల్ శాఖలో సంస్కరణలు, సమూల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంతకాలం నామమాత్రపు జీతాలతో కాలం వెల్లదీసిన దినసరి వేతన సిబ్బందిని పర్మినెట్ చేస్తేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మునిసిపాలిటీల్లో దినసరి ఉద్యోగులు అయిన ఎన్‌ఎంఆర్‌గా పని చేస్తున్న వారిని అర్హతను బట్టి వారి సర్వీసును క్రమబద్ధీకరించేలాని యోచిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా ఇతర అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న ఎన్‌ఎంఆర్‌ల వివరాలు పంపాలని కమిషనర్‌లను మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. ఉత్తర్వు నెం.212, 22-04-1994ను అనుసరించి, అంతకు ముందు నుంచి ఎన్‌ఎంఆర్‌లుగా పని చేస్తున్న వారి జాబితాతో ప్రతిపాదనలను పంపాల్సిందిగా సూచించింది. దీనిపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో చర్చించించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.