కరోనా దెబ్బకు అన్ని పరీక్షలు వాయిదా పడిపోయాయి. కరోనా తగ్గిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే బాటలో ఎంసెట్ కూడా చేరిపోయింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.
ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ సెప్టెంబర్ నెలలో లేనందున, ఆగస్టులోనే ఖాళీ తేదీల్లో నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. దీనిపై అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.