September 15 TikTok Ban: అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి ‘టిక్‌టాక్’ను విక్రయించాలని.. లేదంటే నిషేధం విధించేందుకు సిద్దంగా ఉన్నామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో సాఫ్గ్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్‌టాక్’ హక్కులను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. సెప్టెంబర్ 15 నాటికి ‘టిక్‌టాక్’ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ ధృవీకరించింది. ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. చైనాకు చెందిన ‘బైట్‌డాన్స్’ ‘టిక్‌టాక్’ను అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి సెప్టెంబర్ 15 నాటికి విక్రయించాలని.. అదే చివరి డెడ్‌లైన్ అని తెలిపారు. ఒకవేళ ఆ తేదీ దాటితే మాత్రం నిషేధం తప్పదని హెచ్చరించారు.
బైట్‌డాన్స్‌తో మైక్రోసాఫ్ట్ జరుపుతున్న చర్చలు గురించి మాట్లాడిన ట్రంప్.. కేవలం యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఉన్న 30 శాతం టిక్‌టాక్ నిర్వహణ బాధ్యతలను సొంతం చేసుకోవడం కాకుండా మొత్తం కంపెనీని బైట్‌డాన్స్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ అన్నారు. ఇక డీల్ ఏదైనా కూడా అందులోని గణనీయమైన భాగాన్ని అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఖజానాకు పంపించాల్సి ఉంటుందని ట్రంప్ మరోసారి నొక్కి చెప్పాడు.
Also Read:
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..