ట్రంప్ మద్దతుదారుల్లో ఆ వ్యక్తి ఎవరో తెలిసింది, మరీ ఇంత హంగామా అవసరమా ? విశ్లేషకుల పెదవి విరుపు

ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో అధ్యక్షుడు ట్రంప్ కు  మద్దతు పలుకుతూ హిల్ లోకి దూసుకుపోయిన వేలాది మందిలో ఒక్కడు  అదే పనిగా వీడియోకెక్కాడు.

ట్రంప్ మద్దతుదారుల్లో ఆ వ్యక్తి ఎవరో తెలిసింది, మరీ ఇంత హంగామా అవసరమా ? విశ్లేషకుల పెదవి విరుపు

Edited By:

Updated on: Jan 10, 2021 | 12:56 PM

ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో అధ్యక్షుడు ట్రంప్ కు  మద్దతు పలుకుతూ హిల్ లోకి దూసుకుపోయిన వేలాది మందిలో ఒక్కడు  అదే పనిగా వీడియోకెక్కాడు. హాలీవుడ్ సినిమాల్లో  మాదిరి.. కొమ్ములున్న ఫర్ హ్యాట్ ను తలకు ధరించి ఒళ్ళంతా టాటూలతో, అర్ధనగ్నంగా కనిపించడమే కాదు.. పొడవాటి కొడవలికి అమెరికా జాతీయ పతాకాన్ని కట్టుకుని సీన్ సృష్టించాడీయన.. ఇతని పేరు జాకబ్ ఆంధోనీ ఛాన్స్ లే అట ! మరికొంతమందితో బాటు ఇతగాడు క్యాపిటల్ భవనం లోకి చొరబడి నానా అలజడి చేశాడు.   వీళ్లంతా అనుమతి లేకుండా అక్రమంగా ఈ భవనంలోకి చొరబడ్డారని, ఇష్టం వచ్చినట్టు కేకలు పెట్టారని ఫెడరల్ పోలీసులు కేసు పెట్టి కోర్టులో హాజరు పరిచారు. తనను ట్రంప్ వీర విధేయుడిగా ప్రకటించుకున్న జాకబ్.. గతంలో కూడా చాలాసార్లు ఆయన అనుకూల ర్యాలీల్లో పాల్గొన్నాడు. ఇతని పక్కన నిలబడిన మరో ఇద్దరిని కూడా పోలీసులు  గుర్తించారు. కాగా జాకబ్ ఇంత హంగామా  చేసినా.. ట్రంప్ మాత్రం ఇతడ్ని..చీప్..అని పూర్ అని అభివర్ణించారు. ఈ విధమైన ట్రిక్కులను తను హర్షించబోనన్నారు.

ఇక అమెరికాలోని విశ్లేషకులు కూడా జాకబ్ గారి వేష భాషలను ఈసడించుకున్నారు. ఒక నేత పట్ల ఎంత  అభిమానమున్నా సర్కస్ విదూషకుడిలా ఇతగాడు నిరసన తెలపడం వల్ల నవ్వులపాలయ్యాడన్నది వారి కామెంట్ !