AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వీడియో చూశారంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు బాగా అలవాటైన పనిని మళ్ళీ మొదలుపెట్టారు.. అదే తనను తాను ప్రేమించుకోవడం. ట్రంప్‌కు తనపై ఉన్న వ్యామోహం అందరికీ తెలిసిందే. తన ఈ వ్యామోహాన్ని తాజాగా ప్రదర్శిస్తూ, ఆయన తన ఏఐ (AI) రూపొందించిన ఒక మాంటేజ్ వీడియోను ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు. దానికి జతగా, ప్రతిఒక్కరూ డొనాల్డ్ ట్రంప్‌ను ప్రేమిస్తారు అని పదేపదే వినిపించే ఒక పాటను కూడా షేర్ చేశారు. ఆయన ఈ వీడియోను జూన్ 6న తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు. ఒక్క పోస్ట్‌తో ఆయన సంతృప్తి చెందలేదు. గత ఐదు గంటల్లోనే దాన్ని మళ్ళీ షేర్ చేశారు.

Viral Video: సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వీడియో చూశారంటే..
Donald Trump Ai Video
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2026 | 10:11 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వినూత్నమైన మీమ్స్, పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన ఒక ఏఐ ఆధారిత మ్యూజిక్ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ట్రంప్‌ను ఒక అతీత శక్తులున్న గ్లోబల్ హీరోగా ప్రతిబింబించేలా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో అత్యంత విచిత్రమైన, ఊహాజనిత దృశ్యాలను పొందుపరిచారు. అందులో డొనాల్డ్ ట్రంప్ దట్టమైన అడవిలో ఒక సింహంపై కూర్చుని సవారీ చేయడం, అరబ్ దేశాల ఎడారిలో ఒంటెపై ప్రయాణించడం వంటివి ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో ట్రంప్ భారతదేశ వీధుల్లో బైక్ నడుపుతూ కనిపించడం. అంతేకాకుండా, ఆయన చంద్రుడిపై అమెరికా జెండాను నాటడం, మౌంట్ రష్‌మోర్ చారిత్రక కట్టడంపై ఆయన ముఖచిత్రం ప్రత్యక్షమవడం, ప్రపంచ దేశాల నాయకులతో కలిసి టాకోస్ తింటూ ఆనందించడం వంటి దృశ్యాలు వేగంగా మారుతూ కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఏఐ వీడియో వెనుక ఒక ప్రత్యేకమైన పాట కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. ఎవ్రీబడీ లవ్స్ డొనాల్డ్ ట్రంప్ (ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ డొనాల్డ్ ట్రంప్‌ను ప్రేమిస్తారు) అనే సాహిత్యం ఈ పాటలో పదే పదే వినిపిస్తుంది. ఆయనను ఒక అంతర్జాతీయ రక్షకుడిగా, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు ఆదరించే నాయకుడిగా చూపించడం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం.

వీడియో ఇక్కడ చూడండి..

ట్రంప్ స్వయంగా షేర్ చేసిన ఈ అధునాతన ఏఐ వీడియోను న్యూయార్క్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త, స్టిక్కర్ మ్యూల్ వ్యవస్థాపకుడు ఆంథోనీ కాన్‌స్టాంటినో రూపొందించారు. ట్రంప్ మద్దతుదారుడైన ఆయన, తన నాయకుడి ఇమేజ్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఈ పొలిటికల్ మిథ్ మేకింగ్ (రాజకీయ పురాణ నిర్మాణం) వీడియోను డిజైన్ చేశారు. ఈ వీడియోలో ఎలాంటి రాజకీయ విధానాలు లేదా ప్రభుత్వ ప్రణాళికల గురించిన సందేశాలు లేవు. కేవలం ట్రంప్ శక్తిని, ప్రపంచవ్యాప్త పాపులారిటీని చాటిచెప్పేలా విజువల్స్ ఉన్నాయి. కొందరు దీనిని ఇంటర్నెట్‌లో ఒక సరదా హాస్యాస్పద వీడియోగా చూస్తుండగా, మరికొందరు మాత్రం ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఓటర్లను ఆకర్షించే సరికొత్త రాజకీయ ప్రచార ఎత్తుగడగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ మంకీ బాత్ తరహాలోనే ట్రంప్ సరికొత్త ఏఐ అవతారం ఇప్పుడు అంతర్జాతీయంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us