5

‘హమ్మయ్య ! ఇక అంతా తీరికే ! గోల్ఫ్ ఆడుకుంటా !’

ఎన్నికల్లో ఓటమి అంచుల దాకా వెళ్ళినప్పుడు, ప్రపంచ మంతా ఉత్కంఠగా ఉన్నవేళ.. పరాజిత అధ్యక్షుడు ఏం చేస్తాడు ? ట్రంప్ సారే అయితే ఏమీ పట్టనట్టు గోల్ఫ్ ఆడుకుంటారు. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ విజయానికి చేరువలో ఉన్నారని సమాచారం అందడంతో డొనాల్డ్ ట్రంప్ శనివారం ఉదయమే వైట్ హౌస్ నుంచి బయలుదేరి వర్జీనియాలోని స్టెర్లింగ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పొటోమాక్ నదీ తీరంలోని నేషనల్ గోల్ఫ్ కోర్సు మైదానంలో కొద్దిసేపు గోల్ఫ్ ఆడారు. పెన్సిల్వేనియా రాష్ట్ర […]

'హమ్మయ్య ! ఇక అంతా తీరికే ! గోల్ఫ్ ఆడుకుంటా !'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 08, 2020 | 1:00 PM

ఎన్నికల్లో ఓటమి అంచుల దాకా వెళ్ళినప్పుడు, ప్రపంచ మంతా ఉత్కంఠగా ఉన్నవేళ.. పరాజిత అధ్యక్షుడు ఏం చేస్తాడు ? ట్రంప్ సారే అయితే ఏమీ పట్టనట్టు గోల్ఫ్ ఆడుకుంటారు. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ విజయానికి చేరువలో ఉన్నారని సమాచారం అందడంతో డొనాల్డ్ ట్రంప్ శనివారం ఉదయమే వైట్ హౌస్ నుంచి బయలుదేరి వర్జీనియాలోని స్టెర్లింగ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పొటోమాక్ నదీ తీరంలోని నేషనల్ గోల్ఫ్ కోర్సు మైదానంలో కొద్దిసేపు గోల్ఫ్ ఆడారు. పెన్సిల్వేనియా రాష్ట్ర ఫలితాలు వెల్లడవుతుండగా ఒక్కొక్క న్యూస్ ఛానెలే  వాటిని ప్రకటిస్తున్న సమయంలో ఆయన చలించనట్టుగా ఈ ఆటలో లీనమయ్యారు. అయితే అప్పుడు కూడా ట్రంప్ కార్యాలయం.. బైడెన్ తనను విజేతగా ప్రకటించుకోవడానికి తప్పుడుగా పరుగులు తీస్తున్నారని ఆరోపించింది. చివరి నిముషంలోనైనా  మిరాకిల్ గా ట్రంప్ నే విజయం వరిస్తుందేమోనన్న  మిణుకుమిణుకు ఆశ ఆ ప్రకటనలో కనిపించింది. కానీ సీన్ లో మాత్రం వైట్ హౌస్ వద్ద జో బైడెన్ మద్దతుదారుల ఆనందోత్సాహం పెల్లుబుకుతూ వచ్చింది. బైడెన్ విజయోత్సవానికి హద్దులు లేకపోయాయి.