టీఆర్‌ఎస్‌ కొత్త కార్పొరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం

టీఆర్‌ఎస్‌ కొత్త కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం...

టీఆర్‌ఎస్‌ కొత్త కార్పొరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం

Updated on: Dec 06, 2020 | 5:19 AM

టీఆర్‌ఎస్‌ కొత్త కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్​కు రావాలని కార్పొరేటర్లకు ఈమేరకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ విషయమై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌ నగరాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు ముమ్మర ఏర్పాట్టుచేసినట్టు తెలిపారు.