మారిన మకరజ్యోతి దర్శనం.. ఎప్పుడంటే!

| Edited By:

Dec 30, 2019 | 3:09 PM

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఈ రోజు(సోమవారం) మకర విళక్కు కోసం తెరచుకోనుంది. సంప్రదాయ పూజల తరువాత సాయంత్రం స్వామి సన్నిధానాన్ని అధికారులు తెరవనున్నారు. భక్తుల సౌకర్యార్థం జనవరి 20 వరకు స్వామి దర్శనం కొనసాగుతుంది. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తారు. కాగా.. ఈ సంవత్సరం జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకర సంక్రమణం జనవరి 15న కాబట్టి.. ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ట్రావెన్ కోర్ […]

మారిన మకరజ్యోతి దర్శనం.. ఎప్పుడంటే!
Follow us on

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఈ రోజు(సోమవారం) మకర విళక్కు కోసం తెరచుకోనుంది. సంప్రదాయ పూజల తరువాత సాయంత్రం స్వామి సన్నిధానాన్ని అధికారులు తెరవనున్నారు. భక్తుల సౌకర్యార్థం జనవరి 20 వరకు స్వామి దర్శనం కొనసాగుతుంది. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తారు. కాగా.. ఈ సంవత్సరం జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకర సంక్రమణం జనవరి 15న కాబట్టి.. ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం స్పష్టంచేసింది. ఆపై ఐదు రోజుల పాటు స్వామి దర్శనాలు కొనసాగుతాయని, 21న ఆలయాన్ని మూసివేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.