తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ…మరికొందరికి అదనపు బాధ్యతలు

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతల్నీ అప్పగించింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్‌రామిరెడ్డికి...

తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ...మరికొందరికి అదనపు బాధ్యతలు

Updated on: Nov 14, 2020 | 4:57 AM

Transfer of IAS Officers : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతల్నీ అప్పగించింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్‌రామిరెడ్డికి మెదక్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతల్ని అప్పగించింది.

మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోళికెరి పెద్దపల్లి కలెక్టర్‌గా అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. సంగారెడ్డి కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతికి అదనపు బాధ్యతల్ని అప్పగించింది.