ఒకే ట్రాక్‌పై రెండు రైళ్ల ఢీ.. మానవ తప్పిదమేనంటున్న అధికారులు!

| Edited By: Srinu

Nov 11, 2019 | 5:06 PM

భాగ్యనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు రెండూ కూడా ఒకే ట్రాక్ మీదకు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పదించిన రైల్వే అధికారులు.. లోకో పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ధృవీకరించారు. ఇప్పటికే లింగంపల్లి- ఫలక్‌నామా మధ్య ట్రైన్ల రాకపోకలు నిలిపివేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం బి.బి.సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని.. […]

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్ల ఢీ.. మానవ తప్పిదమేనంటున్న అధికారులు!
Follow us on

భాగ్యనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు రెండూ కూడా ఒకే ట్రాక్ మీదకు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పదించిన రైల్వే అధికారులు.. లోకో పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ధృవీకరించారు. ఇప్పటికే లింగంపల్లి- ఫలక్‌నామా మధ్య ట్రైన్ల రాకపోకలు నిలిపివేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం బి.బి.సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని.. అటు సిగ్నలింగ్ లోపానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే ఎంఎంటీఎస్ ట్రైన్‌ను వేగంగా వచ్చి ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో.. సుమారు 6 బోగీలు బాగా దెబ్బ తిన్నాయని.. ప్రమాదంలో గాయపడిన 12 మంది ప్రయాణికులు చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇకపోతే మరో క్యాబిన్‌లో ఇరుకున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌ డ్రైవర్‌ను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు కొనసాగించాయి. గ్యాస్ కట్టర్ సహాయంతో క్యాబిన్ కట్ చేసి.. అతనికి ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా బయటి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాయి. అటు స్వల్పగాయాలతో బయటపడిన ఇద్దరు ప్రయాణికులను ప్రాధమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.


ఇక ఈ ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ‘ హైదరాబాద్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ హృదయాన్ని కలిచి వేసిందని.. సహాయక బృందాలను ఘటనాస్థలానికి పంపించామన్నారు. అంతేకాకుండా గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు’.