AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy : పండుగ పూట విషాదం..వాటర్ అనుకోని కిరోసిన్ తాగి…

నిజామాబాద్ జిల్లాలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. ఓ 11 నెలల బాలుడు మంచి నీళ్లు అనుకుని కిరోసిన్ తాగడంతో మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామంలో నివశించే సాయిచరణ్, మీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

Tragedy : పండుగ పూట విషాదం..వాటర్ అనుకోని కిరోసిన్ తాగి...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 23, 2020 | 5:00 PM

Share

Tragedy : నిజామాబాద్ జిల్లాలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. ఓ 11 నెలల బాలుడు మంచి నీళ్లు అనుకుని కిరోసిన్ తాగడంతో మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామంలో నివశించే సాయిచరణ్, మీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. శివరాత్రి పర్వదినం కావడంతో కుటుంబ సభ్యులంతా ఇంటిని శుభ్రపరిచే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో వారి 11 నెలల బాలుడు సాయివర్ధన్..ఆడుకుంటూ వెళ్లి కట్టెల పొయ్య పక్కన డబ్బాలో ఉన్న కిరోసిన్‌ను మంచినీళ్లు అనుకోని తాగేశాడు. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని.. బోధన్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో అక్కడి డాక్టర్లు నిజామాబాద్ పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యములోనే బాలుడు మృతి చెందాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న కుమారు కన్నుమూయడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి : బాలుడి ఒంటి నుంచి కారుతోన్న రక్తం.. ఇదో వింత వ్యాధి..

Follow Us